సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని చర్చిల్లో శుభ శుక్రవారం ప్రార్థన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పట్టణంలో బేతేలు మందిరం, కర్మెల్ ఫుల్ గాస్పెల్, బిలివర్స్, కర్మెల్, బేతెస్థ ప్రార్థనా మందిరాల్లో క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొని ఏసు ప్రభును కీర్తించారు. క్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటలను ధ్యానం చేస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బేతేలు చర్చిలో దైవజనులు వస్కుల శేఖర్ శుభ శుక్రవార దైవ సందేశమిచ్చారు.
హుస్నాబాద్ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు - సిద్దిపేట
శుభ శుక్రవారం సందర్భంగా హుస్నాబాద్‌లోని ప్రార్థనా మందిరాల్లో క్రైస్తవులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శుభ శుక్రవారం ప్రార్థన కార్యక్రమాలు