సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్‌లో... ఎరువుల రేకు పాయింట్‌ను మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. కాకినాడ ఎమ్‌ఎఫ్‌సీఎల్ నుంచి 21 బోగిల్లో గజ్వేల్‌కు... 1300 మెట్రిక్ టన్నుల ఎరువులు చేరుకున్నాయి. గజ్వేల్ నుంచి ఆయా ప్రాంతాలకు ట్రక్కుల్లో ఎరువులను పంపించారు. తెలంగాణకు వస్తున్న భాజపా పెద్దలు ఇక్కడకి వచ్చి ఏం చెబుతారంటూ... పలు అంశాలపై కేంద్రాన్ని మంత్రి హరీశ్‌రావు నిలదీశారు.
''వరంగల్‌కు మంజూరైన రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ గుజరాత్‌కు తరలించుకోపోయారు. ధాన్యం కొనకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారంటూ'' హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాన్ని ఏలుతున్న పార్టీ... వరిసాగులో ధాన్యం కొనుగోలులో బాధ్యతారహితంగా వ్యవహరించిందని... మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు.