తెలంగాణ

telangana

మత్స్యకారుల అభివృద్ధి కోసం పాండవుల చెరువులోకి చేపపిల్లల విడుదల

సిద్దిపేట జిల్లా గజ్వేల్​ పట్టణంలోని పాండవుల చెరువులోకి అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్​ ఛైర్మన్​ ప్రతాప్​రెడ్డి చేపపిల్లలను విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తులను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్​ ఎంతగానో కృషి చేస్తున్నారని ఆయన వెల్లడించారు.

By

Published : Sep 25, 2020, 4:26 PM IST

Published : Sep 25, 2020, 4:26 PM IST

fish release into river for fisherman
మత్స్యకారుల అభివృద్ధి కోసం పాండవుల చెరువులోకి చేపపిల్లల విడుదల

అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్​ ఛైర్మన్​ ప్రతాప్​రెడ్డి సిద్దిపేట జిల్లా గజ్వేల్​ పట్టణంలోని పాండవుల చెరువులోకి చేపపిల్లలను విడుదల చేశారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు, జలాశయాల్లోకి ఉచితంగా చేపపిల్లలను విడుదల చేస్తున్నామన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తులను ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే గ్రామాభివృద్ధి జరుగుతుందని ప్రతాప్ అన్నారు. కార్యక్రమంలో గజ్వేల్​ ప్రజ్ఞాపూర్​ మున్సిపల్​ ఛైర్మన్​, గజ్వేల్​ మార్కెట్​ కమిటీ ఛైర్​పర్సన్, జడ్పీటీసీ సభ్యులు, తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details