ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి రోజు 261మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. గరిష్ఠంగా మెదక్ జిల్లా ఆసుపత్రిలో 30మంది వేయించుకోగా, అత్యల్పంగా సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కేవలం 11మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు. 69 మంది వివిధ కారణాలతో వ్యాక్సిన్ వేయించుకోలేదు.
సంగారెడ్డి
ఇందిరా కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేద్రంలో 24మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. మొదటి టీకాను ఇదే ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వర్తించే సుకన్యకు ఇచ్చారు.
పటాన్చెరు
పటాన్చెరు ప్రాంతీయ ఆసుపత్రిలో 17మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ ఆసుపత్రిలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసే కొండల్‌కు మొదటి టీకా వేశారు.
జోగిపేట
జోగిపేట ప్రాంతీయ ఆసుపత్రిలో 29మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇదే ఆసుపత్రిలో డార్క్ రూం అసిస్టెంటుగా విధులు నిర్వర్తిస్తున్న నాగరాజు మొదటి టీకా వేయించుకున్నారు. స్టాఫ్ నర్సుగా విధులు నిర్వర్తిస్తున్న లక్ష్మి ఆందోళనకు గురవడంతో నాగరాజుకు మొదటి అవకాశం వచ్చింది. అనంతరం లక్ష్మీ సైతం వ్యాక్సిన్ వేయించుకున్నారు.
దిగ్వాల్
దిగ్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 26 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇదే ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యుడు రాజు కుమార్ మొదటి టీకా వేయించుకున్నారు.
జహీరాబాద్
జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రిలో 22మంది టీకా వేయించుకున్నారు. ఈ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికురాలిగా విధులు నిర్వర్తిస్తున్న ఎలిజబెత్‌కు మొదటి వ్యాక్సిన్ వేశారు.
ఝరాసంఘం