తెలంగాణ

telangana

By

Published : Jun 19, 2020, 8:57 AM IST

ETV Bharat / state

త్వరలోనే కోమటిచెరువులోకి గోదావరి జలాలు: హరీశ్​

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు ఫీడర్​ కాలువను మంత్రి హరీశ్​రావు పరిశీలించారు. ఈ సందర్భంగా కాలువ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

finance minister harish rao toured in siddipet
త్వరలోనే కోమటిచెరువులోకి గోదావరి జలాలు:హరీశ్​

త్వరలో కోమటి చెరువులోకి గోదావరి నీళ్లు రానున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఫీడర్ కాలువ పనులు జరగాలని అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు ఫీడర్​ కాలువ పనులను మంత్రి పరిశీలించారు. కాలువ వెంట కాలినడకన 2 కిలో మీటర్ల మేర పనులను పరిశీలించారు.

తడ్కపల్లి, ఎన్సాన్​పల్లి చెరువులు నిండిన నేపథ్యంలో.. ప్యాకేజీ 12 నుంచి త్వరలోనే కోమటి చెరువుకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కనున్నాయని మంత్రి పేర్కొన్నారు. కోమటి చెరువు కాలువ ద్వారా నర్సాపుర్ చెరువుకు నీళ్లు వస్తాయని తెలిపారు. ఈ మేరకు యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దగ్గరుండి పనులు పూర్తి చేయించాలని ఛైర్మన్ రాజనర్సుకు సూచించారు.

ఇదీచూడండి: జగిత్యాల స్ఫూర్తితో ‘జలహితం'.. సిరిసిల్లలో ప్రారంభించనున్న కేటీఆర్‌

ABOUT THE AUTHOR

...view details