తెలంగాణ

telangana

ETV Bharat / state

Farmers Protest at Thoguta MRO Office : మా చెక్కులిచ్చే వరకు కదిలేదు లేదు.. ఎమ్మార్వో ఆఫీస్​లో బైఠాయించిన రైతులు, ఎమ్మెల్యే - టీఎంసీ కాలువ భూనిర్వాహితులకు చెక్కులు ఇవ్వాలి

Farmers Demand To Give TMC Canal Land cheques : సిద్దిపేట జిల్లా తొగుట తహసీల్దార్​ కార్యాలయంలో ఘనపూర్​ రైతులు ఆందోళన చేశారు. మల్లన్నసాగర్​ జలాశయానికి టీఎంసీ కాలువ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు చెక్కులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. వారికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు మద్దతు తెలిపారు.

Farmers
Farmers

By

Published : Jul 14, 2023, 6:58 PM IST

Farmers Agitation At MRO Office For Cheques : మల్లన్నసాగర్​ జలాశయానికి అదనపు టీఎంసీ కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి చెక్కులు ఇవ్వాలని ఘనపూర్​ నిర్వాసిత రైతులు ఆందోళన చేపట్టారు. తొగుట తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించారు. వారికి మద్దతుగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు తహసీల్దార్​ కార్యాలయానికి చేరుకున్నారు. నిర్వాసితులకు చెక్కులు ఇచ్చే వరకు కదిలేది లేదని వారితో పాటు కార్యాలయంలో బైఠాయించారు.

మల్లన్న సాగర్​ జలాశయానికి అదనపు టీఎంసీ కాలువ నిర్మాణం కోసం సేకరించిన భూములకు సంబంధించి నిర్వాసితులకు చెక్కులు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు నిరసన వ్యక్తం చేశారు. తమ పేరిట వచ్చిన చెక్కులు తమకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు తహసీల్దార్​ కార్యాలయాన్ని ముట్టడించారు.

Farmers Land To TMC Canal in Mallanna Sagar Project : తహసీల్దార్​ మాత్రం చెక్కులను కలెక్టర్​ కార్యాలయానికి వెళ్లి తీసుకోవాలని సూచించారు. దీంతో ఆగ్రహించిన నిర్వాసితులు ఆయన గదిలోనే కూర్చుని.. తమ చెక్కులు ఇచ్చే వరకు ఎక్కడికి కదలబోమని భీష్మించుకు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భూ నిర్వాసితులతో పాటు అక్కడే భీష్మించుకుని కూర్చున్నారు. మల్లన్న సాగర్​ జలాశయానికి అదనంగా టీఎంసీ కాలువ నిర్మాణానికి ఘనపూర్​ రైతులు భూములను ఇచ్చారు. అయితే అప్పుడు రైతులు భూములు ఇస్తే అందుకు తగిన నగదును చెక్కుల రూపంలో పరిహారంగా చెల్లిస్తామని.. రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే నేడు ఈ చెక్కులు రావడంతో రైతులు వెళ్లి అడిగితే.. ఈ పరిస్థితి నెలకొంది.

సీతమ్మ సాగర్​ ప్రాజెక్టు పనుల కొనసాగింపై ఎన్టీజీ సీరియస్​ : మరోవైపు.. సీతమ్మ సాగర్​ ప్రాజెక్టు పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ హరిత ట్రైబ్యునల్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిలిపి వేయాలని ఆదేశాలిచ్చిన తర్వాత కూడా.. తమ ఆదేశాలకు విరుద్ధంగా పనులు కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతులు లేనందున సీతమ్మ సాగర్​ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని గతంలోనే ఎన్జీటీ ఆదేశించింది.

NTG Serious Continuation Of Seethamma Sagar Project : పనులు కొనసాగించడం ధిక్కరణకు పాల్పడడమేనని ట్రైబ్యునల్​ పేర్కొంది. ఈ విషయంపై ఎందుకు చర్యలు తీసుకోలేదని గోదావరి బోర్డు, కేంద్ర పర్యావరణ శాఖలపైనా ఎన్టీజీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే అందుకు తగిన నివేదిక ఇవ్వాలని.. గోదావరి బోర్డు, కేంద్ర పర్యావరణ శాఖకు ఎన్జీజీ ఆదేశాలు జారీ చేసింది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details