సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవాపూర్‌కు చెందిన గంధపు కనకయ్య గౌడ్(58) అనే రైతు అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కనకయ్య సంవత్సరం క్రితం చిన్న కుమార్తెకు వివాహం చేశారు. కుమారుడు దివ్యాంగుడు. ఈ ఖరీఫ్‌లో 3 ఎకరాల భూమిలో మొక్కజొన్న, పత్తి విత్తనాలు వేశారు. వర్షాలు లేక విత్తనాలు మొలకెత్తలేదు. మరోవైపు అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేయడం వల్ల మనస్తాపం చెందిన కనకయ్య గౌడ్ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడికి 3 ఎకరాల భూమి ఉన్నా ఇంకా పట్టాకాలేదు. రైతుబంధు, రైతు బీమా కూడా రైతు కుటుంబానికి వర్తించదని గ్రామ సర్పంచ్ అన్నారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
భూ తల్లిని నమ్ముకున్న రైతుకు కన్నీల్లే మిగులుతున్నాయి. వర్షాభావం ఓ వైపు... అప్పులు బాధ మరోవైపు అన్నదాతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రుణమాఫీ అన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి మాఫీ చేయలేదు. ఇక ఏం చేయాలో తెలియని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కేశవాపూర్‌లో జరిగింది.
ఎండిపోయిన మొక్కజొన్న