సిద్దిపేట జిల్లాలో పలు ఇళ్లల్లో సోదాలు చేసిన వ్యవసాయ శాఖ విజిలెన్స్ అధికారులు భారీ ఎత్తున నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 30 బస్తాల్లో 1,365 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.34 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మొత్తం ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకన్నారు. విత్తనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించి.. నిందితులను పోలీసులకు అప్పగించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కుమార్ తెలిపారు.
రూ.34 లక్షల నకిలీ విత్తనాల పట్టివేత - artificial seed
సిద్దిపేట జిల్లావ్యాప్తంగా వ్యవసాయ శాఖ విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. మొత్తం 30 బస్తాల్లో రూ. 34 లక్షలు విలువ చేసే 1,365 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ విత్తనాల పట్టివేత