Etela Rajendar Election Campaign In Siddipet : హరీశ్‌రావుకు తనని విమర్శించే హక్కు లేదని ఈటల రాజేందర్ అన్నారు. హరీశ్రావుకుబీఆర్ఎస్(BRS)లో సొంతంగా పనిచేసే కెపాసిటీ ఉందా.. సొంతంగా మీరు నిర్ణయం తీసుకోగలరా.. ఈశ్వరుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు.. అలానే కేసీఆర్ చెప్పనిదే ఏమన్నా చేయగలవా.. అంటూ మంత్రి హరీష్‌రావును బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్, గజ్వేల్ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. కుక్కునూరుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఈటల పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీలను సీఎం చేస్తారా అని ఈటల రాజేందర్ కేసీఆర్‌కు సవాల్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే తర్వాత ఆయన కుంటుంబమే ముఖ్యమంత్రిలుగా వస్తారని ఈటల దుయ్యబట్టారు. ఇతరులెవరు సీఎం కాలేరని విమర్శించారు.
ఆకలి తెలిసిన మేము అధికారంలోకి వస్తే బాధలన్నీ తీరుస్తాం : ఈటల రాజేందర్
Etela Rajendar Fires On BRS : అణగారిన వర్గాల పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ ఏనాడైనా ఎస్టీ, ఎస్సీ, బీసీని ముఖ్యమంత్రి చేశారా అని ప్రశ్నించారు.ప్రధాని మోదీ పేదరికాన్ని అనుభవించిన బిడ్డ కాబట్టి బీసీని సీఎం చేస్తా అని ప్రకటించారు. మన ఓట్లు మనమే వేసుకోవాలి. వాళ్లకి ఓట్లు వేసి పనులు చేయమంటే చెయ్యరు. శుక్రవారం సీఎం మాట్లాడుతూ.. గాడిదలకు గడ్డివేసి ఆవులకు పాలు పిండితే వస్తాయా? అని అడుగుతున్నారు. తాను అదే అడుగుతున్న..కేసీఆర్‌కి ఓటు వేసి.. ఇల్లు, రేషన్ కార్డు ఇవ్వమంటే ఇస్తారా? ఫాం హౌస్ కట్టుకున్న సీఎం పేదలకు ఇళ్లు ఇవ్వడానికి మనసు రావడం లేదని ఆరోపించారు. పేదల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.