మల్లన్నసాగర్‌పై సాంకేతిక కమిటీ ఏర్పాటు - mallanna sagar latest news
15:54 January 28
మల్లన్నసాగర్‌పై సాంకేతిక కమిటీ ఏర్పాటు
మల్లన్నసాగర్ జలాశయానికి సంబంధించిన సాంకేతిక అంశాల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. జలాశాయ డిజైన్లు, స్టెబిలిటీ అనాలసిస్ తదితర అంశాలపై సాంకేతిక కమిటీ ఏర్పాటైంది.
ఈఎన్సీ జనరల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలో.. గజ్వేల్ ఈఎన్సీ, సీఈ చంద్రశేఖర్, హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ ఉమాశంకర్, ఓయూ జియో టెక్నికల్ హెడ్ ఎం.వి.ఎస్. శ్రీధర్, పుణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్ శాస్త్రవేత్త, జీఎస్ఐలోని సీనియర్ ఇంజినీరింగ్ జియాలజిస్ట్ సభ్యులుగా ఉన్నారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి: రాష్ట్రంలో 109 అర్బన్ పార్కులు ఏర్పాటుచేస్తాం: హరీశ్‌రావు