సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి గెలుపు తథ్యమని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి అన్నారు. దుబ్బాక ఓటర్లు కాంగ్రెస్ వైపే ఉన్నారని చెప్పారు. భాజపా, తెరాసలు ప్రజలను మభ్యపెట్టడంలో పోటీ పడుతున్నాయన్నారు.
దుబ్బాకలో కాంగ్రెస్ గెలుపు తథ్యం: గూడూరు నారాయణరెడ్డి - సిద్దిపేట జిల్లా తాజా సమాచారం
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం ఖాయమని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి జోస్యం చెప్పారు. అధికారంలో ఉన్న తెరాసకు ఉపఎన్నికలో ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి వైపే దుబ్బాక ఓటర్లు ఉన్నారని అన్నారు.
దుబ్బాకలో కాంగ్రెస్ గెలుపు తథ్యం: గూడూరు నారాయణరెడ్డి
తెరాసపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని మాజీ మంత్రి ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి తనయుడిని గెలిపిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ పాలన ప్రజలకు శాపంలా మారిందని విమర్శించారు. భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. దుబ్బాక ప్రజలు కాంగ్రెస్‌ని గెలిపించి తెరాసకు తగిన గుణపాఠం చెప్పాలని నారాయణరెడ్డి వ్యాఖ్యానించారు.