నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక మాదిరి.. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలోనూ కాంగ్రెస్, భాజపాల డిపాజిట్ గల్లంతవుతాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. కేంద్రం నుంచి సంక్షేమ పథకాలకు నిధులు వస్తున్నాయంటోన్ భాజపా నాయకులు.. ముందు లెక్కలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. పప్పులో ఉప్పేసి అంతా మేమే చేశామన్నట్లుగా కాషాయ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
'మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. ప్రజలు మావైపే ఉన్నారు' - dubbaka by elections 2020
దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా సోలిపేట సుజాతకు అండగా నిలుస్తూ తాము పనిచేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్, భాజపా నుంచి తెరాసలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి.. కాంగ్రెస్, భాజపాల నుంచి తెరాసలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హుజూర్నగర్ ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలో గెలవలేని ఉత్తమ్ కుమార్ రెడ్డి.. దుబ్బాకలో ఎలా గెలుస్తారని ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, భాజపాలు ఎన్ని జిమ్మిక్కులు చేచసినా.. ప్రజలు తెరాస వైపే ఉన్నారని స్పష్టం చేశారు.