దుబ్బాక ఉపఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్, భాజపా విమర్శలతో హోరెత్తిస్తున్నాయి. ఉపఎన్నికలో రికార్డుస్థాయి మెజార్టీతో తెరాస విజయం సాధిస్తామని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. తెరాసలో చేరిన వివిధ పార్టీల నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామాల్లోకి ప్రచారానికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలకు ప్రజల నుంచి ఆదరణ లభించడం లేదని విమర్శించారు. ఎన్నికల ప్రణాళికలో లేని హామీలను అమలు పరిచిన ప్రభుత్వం తమదేనని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు
కాంగ్రెస్ హయాంలోనే ఎల్ఆర్ఎస్ తీసుకురాలేదా? అని ప్రశ్నించిన హరీశ్ ... ఉత్తమ్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రవాస తెలంగాణ తెరాస నేతలతో మంత్రి హరీశ్‌రావు దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచార సరళిని వివరించిన మంత్రి... ఎన్నారైలు క్రియాశీలక పాత్ర పోషించాలని దిశానిర్దేశం చేశారు. దుబ్బాకలో తెరాస చేసిన అభివృద్ధిని వారికి వివరించారు. సోలిపేట సుజాత గెలుపునకు సహకరించాలని కోరారు.
కాంగ్రెస్‌కే పట్టం కట్టాలి