సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ధ్రువపత్రాలు లేని, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిపై కేసులు నమోదు చేసి, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
'మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు'
సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. మద్యం సేవించి వాహనం నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
'మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు'
ద్విచక్ర వాహనదారులు.. డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్, ఇన్సూరెన్స్, ధ్రువ పత్రాలను కలిగి ఉండాలని ఎస్సై రవి తెలిపారు. కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకొవాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:ద్విచక్రవాహనం, ఆటో ఢీ.. భార్యాభర్తలు మృతి