తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త మండలంగా దూల్​మిట్ట... తుది ప్రకటన విడుదల - new mandal list

సిద్దిపేటలో మరో కొత్త మండలంగా ఏర్పాటైంది. హుస్నాబాద్​ డివిజన్​లోని ఎనిమిది గ్రామలతో దూల్​మిట్టను కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. గతంలోనే ప్రాథమిక ప్రటకన జారీ చేసిన సర్కారు... తాజాగా తుది నోటిఫికేషన్​ విడుదల చేసింది.

dhoolmitta as new mandal in siddipet district
dhoolmitta as new mandal in siddipet district

By

Published : Dec 8, 2020, 7:34 PM IST

సిద్దిపేట జిల్లాలో దూల్​మిట్టను కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం... తాజాగా తుది ప్రకటన విడుదలచేసింది. హుస్నాబాద్ డివిజన్​లోని ఎనిమిది గ్రామాలతో కొత్త మండలం ఏర్పాటైంది.

దూల్​మిట్ట, లింగాపూర్, జాలపల్లి, బైరాన్​పల్లి, బెక్కత్, కొండాపూర్, కూటిగల్ గ్రామాలు కొత్త మండలంలో ఉంటాయి. అటు మద్దూరు మండలంలోని కమలాయపల్లి, అర్జునపట్ల గ్రామాలను చేర్యాల మండలానికి బదలాయించారు. ఈ మేరకు తుది నోటిఫికేషన్ జారీ చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడండి: వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు ఉద్యమిస్తాం: హరీశ్

ABOUT THE AUTHOR

...view details