తెలంగాణ

telangana

ETV Bharat / state

గాలివాన బీభత్సం... భారీ ఆస్తి నష్టం

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో ప్రజలు అల్లాడితే.. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో ఓ మోస్తరు వాన కురిసింది. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్​ స్తంభాలు నేలకొరగగా భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.

By

Published : May 25, 2020, 11:14 PM IST

Dangerous The wind rains in Siddipeta district
గాలివాన బీభత్సం... భారీ ఆస్తి నష్టం

సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపూర్ వద్ద గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు దుకాణ సముదాయాలు, చెట్లు, విద్యుత్​ స్తంభాలు నేలకొరిగాయి. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా వలస కూలీలు నిర్మించుకున్న రేకుల షెడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి.

ట్రాన్స్​ఫార్మర్లు దెబ్బతినటం వల్ల చాలాచోట్ల విద్యుత్​ సరఫరాకు అంతరాయం కలిగింది. గాలివాన బీభత్సం వల్ల భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. సర్వం కోల్పోయిన వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details