కరోనా నివారణతో పాటు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర గొప్పదని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ సర్పంచ్ దుండ్ర భారతి అన్నారు. శుక్రవారం గ్రామానికి చెందిన జనగామ పాపారావు సహకారంతో తోటపల్లి, గాంధీనగర్ గ్రామాల పారిశుద్ధ్య కార్మికులకు 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ - పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ
సిద్దిపేట జిల్లా గాంధీనగర్, తోటపల్లి గ్రామాల పారిశుద్ధ్య కార్మికులకు గాంధీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ
తన తండ్రి వీరారావు 24వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పాపారావు సోదరుడు కమలాకర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు అన్నపూర్ణ, ఉప సర్పంచ్ రాంబాబు, మాజీ సర్పంచ్ బోంగోని శ్రీనివాస్, మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రామగోపాల్ రావు, తోటపల్లి సర్పంచ్ పొలవెని లత, పారిశుద్ధ్య కార్మికులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్‌జోన్ జిల్లాలివే...
TAGGED:
SANITATION WORKERS