తెలంగాణ

telangana

ETV Bharat / state

వలస కార్మికుల విషయంలో ప్రభుత్వాలు విఫలం : సీపీఐ - సీపీఐ నిరసన

కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​లో వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ విమర్శించింది. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ నిరసన తెలపాలని సీపీఐ జాతీయ అధిష్టానం పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో సీపీఐ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

Cpi Protest Against State And Central Governments
వలస కార్మికుల విషయంలో ప్రభుత్వాలు విఫలం : సీపీఐ

By

Published : May 19, 2020, 11:37 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. లాక్​డౌన్​ వల్ల ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ నాయకులు ఆరోపించారు. వలస కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్నారు.

వలస కార్మికులకు రూ.10వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్​ చేశారు. లాక్​డౌన్​ వల్ల వలస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని అన్నారు. ప్రభుత్వాలు బాధ్యతను గుర్తించి పట్టణ, గ్రామీణ కార్మికులతో పాటు.. వలస కార్మికులను కూడా ఆదుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్​ చేశారు.

ఇవీ చూడండి; సమగ్ర వ్యవసాయ విధానంపై మంత్రి సమీక్ష

ABOUT THE AUTHOR

...view details