సిద్ధిపేట జిల్లాలోని పందిల్ల, కుచనపల్లి, గోవర్ధనగిరి, బొడిగెపల్లి, గుబ్బడి, జనగాం, గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సీపీఐ జిల్లా నాయకులు సందర్శించారు. అకాల వర్షానికి తడిసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఒక్కో కొనుగోలు కేంద్రం వద్ద 20 రోజులకు పైగా ధాన్యాన్ని నిల్వ ఉంచుతున్నారని, అందుకే.. అకాల వర్షాలు వచ్చినప్పుడు ధాన్యం తడిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
'తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి’ - CPI Leaders Visit Paddy Buying Centers In Siddipet district
అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిద్ధిపేట సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ డిమాండ్ చేశారు.
'తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి’
ఎప్పటి ధాన్యం అప్పుడు కొనుగోలు చేస్తే.. ఈ సమస్య వచ్చేది కాదని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ ఆగ్రహించారు. గన్నీ సంచులు, టార్పాలిన్లు పంపడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులకు అన్యాయం చేస్తే.. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.