దుబ్బాక ఉపఎన్నికను కాంగ్రెస్ సవాల్‌గా తీసుకుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మణిక్కంఠాగూర్ వెల్లడించారు. అధికార తెరాసనే తమకు ప్రధాన ప్రత్యర్థిగా ఆయన పేర్కొన్నారు. గెలుపు కోసం పార్టీ నాయకత్వమంతా ఐక్యంగా కృషి చేస్తుందన్నారు.
'అధికారం, డబ్బుతో గెలిచేందుకు తెరాస కుట్ర' - కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మణిక్కం ఠాగూర్ వార్తలు
దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే... కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మణిక్కంఠాగూర్ వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో నివేదికలన్నీ కాంగ్రెస్ గెలుపునకు అనుకూలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.
'అధికారం, డబ్బును అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు'
అధికారం, డబ్బును అడ్డుపెట్టుకుని తెరాస, భాజపాలు ఉపఎన్నికల్లో గెలుపొందాలనుకుంటున్నాయని ఆరోపించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు.... దుబ్బాక ఉపఎన్నిక కాంగ్రెస్‌కు సన్నాహకంలాంటిదంటున్న మణిక్కంఠాగూర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చూడండి:హామీలు గుర్తుకు రావాలంటే.. తెరాసను ఓడించాలి: ఉత్తమ్