ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటూ... వాళ్లకి ఎలాంటి సాయం చేయడానికైనా మేము సిద్ధమని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం జడ్పీటీసీ కొండల్ రెడ్డి అన్నారు. సిద్దిపేట డిపో ఆవరణలో దీక్ష శిబిరం వద్ద ఆర్టీసీ కార్మికులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. 19 రోజుల నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని కొండల్ రెడ్డి పేర్కొన్నారు. కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు సూచించినా కేసీఆర్... స్పందించకుండా మొండిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'ఆర్టీసీ కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం' - tsrtc workers strike at siddipeta
సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 19వ రోజూ ప్రశాంతంగా కొనసాగుతోంది.
'ఆర్టీసీ కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం'