తెలంగాణ

telangana

ETV Bharat / state

గౌరవెల్లి ప్రాజెక్టుపై కాంగ్రెస్​ నేతల జలదీక్ష

కాంగ్రెస్ హయాంలో శంకుస్థాపన చేసిన.. ప్రాజెక్టులను తెరాస ప్రభుత్వం కావలనే జాప్యం చేస్తోందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టుపై నిర్వహించిన జలదీక్షలో కాంగ్రెస్​ నేతలు పాల్గొన్నారు.

congress-leaders-protest-in-akkannapeta-guravelli-project
గౌరవెల్లి ప్రాజెక్టుపై కాంగ్రెస్​ నేతల జలదీక్ష

By

Published : Jun 13, 2020, 3:02 PM IST

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టుపై.. కాంగ్రెస్​ నేతలు జలదీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, నియోజకవర్గ ఇంఛార్జి బొమ్మశ్రీరాంతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను.. తెరాస జాప్యం చేస్తోందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆరోపించారు.ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు.

హుస్నాబాద్ ప్రజల ఆకాంక్ష..

కాంగ్రెస్​ చేపట్టిన జలదీక్ష కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడానికి.. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం నాటకాలాడుతోందని సంపత్​ విమర్శించారు. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేస్తి.. హుస్నాబాద్ మెట్టప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్చాలని డిమాండ్​ చేశారు.

జలదీక్ష భగ్నం..

ఇప్పటికైనా ప్రభుత్వం నియంతృత్వ పాలన విడిచి ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి హుస్నాబాద్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చూడండి:24 గంటల్లో 11,458 మందికి కరోనా- 386 మంది బలి

ABOUT THE AUTHOR

...view details