సమ్మె కాలంలో సీఎం పిలుపును అనుసరించి బస్సులు నడిపిన వారిని.. కష్ట కాలంలో ప్రభుత్వమే ఆదుకోవాలని అద్దె బస్ డ్రైవర్ల సంఘం అధ్యక్షులు గడిపె మల్లేశ్ కోరారు. ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్లు, క్లీనర్లు.. లాక్డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డిపో ఏదుట ఆయా సిబ్బందితో కలిసి ఆందోళన చేపట్టారు. కష్ట కాలంలో ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకున్నట్లు.. తమనూ ఆదుకోవాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్ల ఆందోళన - అద్దె బస్ డ్రైవర్ల కష్టాలు
లాక్డౌన్లో బస్సులు నడవక.. ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్లు, క్లీనర్లకు కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందంటూ అద్దె బస్ డ్రైవర్ల సంఘం అధ్యక్షులు గడిపె మల్లేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె కాలంలో.. సీఎం పిలుపును అనుసరించి బస్సులు నడిపిన వారిని కష్ట కాలంలో ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
concerns of hired rtc employees
లాక్డౌన్లో బస్సులు నడవక.. డ్రైవర్, క్లినర్లకు కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందంటూ మల్లేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు డ్రైవర్లకు ప్రతి నెల 5 లోగా జీతాలు చెల్లించాలేలా యాజమాన్యంపై ఒత్తిడి పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. లాక్డౌన్ సమయంలో నెలకు రూ 10 వేలు ఆర్థిక సాయంగా ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.