సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం ఇటిక్యాల గ్రామ రైతులతో జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి సుదీర్ష చర్చలు జరిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రామంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆయన తెలిపారు. దీర్ఘకాలిక భూ సమస్యల పూర్వాపరాలను ఆ గ్రామ స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులను అడిగి తెలుసుకున్నారు. ఏళ్లుగా భూములను సాగుచేసుకుంటున్నా.. వాటిపై తమకు యాజమాన్య హక్కులు లేక తీవ్ర అగచాట్లు పడుతున్నామని గ్రామ రైతులు కలెక్టర్కు విన్నవించారు.
'సీఎం ఆదేశాల మేరకు వచ్చా.. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతా' - siddipeta district latest news
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు.. దశాబ్దాల పాటు అపరిష్కృతంగా ఉన్న సిద్దిపేట జిల్లా ఇటిక్యాలలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని కలెక్టర్ వెంకట్రామ రెడ్డి అన్నారు. స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులతో అక్కడి సమస్యలపై ఆయన సుదీర్ఘ చర్చలు జరిపారు.

'సీఎం ఆదేశాల మేరకు వచ్చా.. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతా'
ఈ భూ సమస్యల విషయం సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లగానే వెంటనే స్పందించిన ఆయన దశాబ్దాల నుంచి ఉన్న సమస్యకు సాధ్యమైనంత త్వరలో శాశ్వత పరిష్కారం చూపాలని తనను పంపిచారని కలెక్టర్ తెలిపారు. రైతు బంధు, పంట పెట్టుబడి సహాయం అందేలా చూడాలని ఆదేశించారని పేర్కొన్నారు. అత్యంత పారదర్శకంగా భూ సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. గంటకు 62 పాజిటివ్ కేసులు