సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రధాన కాలువల నుంచి రైతు పొలాలకు నీరందించే కాలువల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. భూసేకరణపై గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహశీల్దార్లతో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సమీక్ష నిర్వహించారు. 40 రోజుల్లోగా భూసేకరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. వీటి నిర్మాణం పూర్తి అయితే రైతులు 3 పంటలు సాగుచేసుకోవచ్చని వెల్లడించారు.
కొండపోచమ్మతో మూడు పంటల సాగు: కలెక్టర్ - kondapochamma reservoir
కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి పొలాలకు నీరందించే కాలువల నిర్మాణానికి భూసేకరణ పనులు వేగవంతం చేయాలని తహశీల్దార్‌ను సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆదేశించారు.
కొండపోచమ్మతో మూడు పంటల సాగు: కలెక్టర్