గతంలో మంచినీటి కోసం కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సీఎం కేసీఆర్ (Cm Kcr) తెలిపారు. గతంలో తాగు, సాగునీటి కోసం సిద్దిపేట ప్రజలు ఎంతో గోస పడ్డారని గుర్తుచేశారు. ప్రస్తుతం చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. మే నెలలో కూడా చెరువులు అలుగు పారుతున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సబ్‌స్టేషన్ కోసం ఎంతో శ్రమించాల్సి వచ్చేదని ఆనాటి రోజులను ప్రసంగంలో చెప్పుకొచ్చారు.
ప్రజలకు మేలు చేసేలా నిర్ణయాలు ఉండాలని సీఎం కేసీఆర్ (Cm Kcr) మరోమారు పేర్కొన్నారు. ఒక్క తప్పటడుగు వేస్తే కొన్ని తరాలు నష్టపోతాయని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ప్రాధాన్యతగా విద్యుత్ సమస్యను పరిష్కరించినట్లు సీఎం స్పష్టం చేశారు.
విద్యుత్ సమస్యను మొదటి ప్రాధాన్యతగా పరిష్కరించుకున్నం. ఇప్పుడు ఎక్కడ మోటారు కాలదు. ఆ మోటార్ రీపేర్ చేసే దుకాణాదారులు దివాళ తీసిన పరిస్థితి వచ్చింది. వాళ్లు వచ్చి నన్ను అడుగుతున్నరు మా సంగతి ఏందని? కరెంట్‌లో మనం ఏం బాధలు అనుభవించామో అందరి కంటే ఎక్కువ సిద్దిపేట ప్రజలకు తెలుసు.
--- ముఖ్యమంత్రి కేసీఆర్