తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్దిపేటలో ఆర్టీసీ డిపో ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా - సిద్దిపేట జిల్లా తాజావార్తలు

సిద్దిపేట జిల్లా ఆర్టీసీ బస్ డిపో ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కరోనా కాలంలో ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకోవాలని కోరారు. పెట్రోల్​, డీజిల్​పై పెంచిన ఎక్సైజ్​ డ్యూటీని ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

సిద్దిపేటలో ఆర్టీసీ డిపో ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
సిద్దిపేటలో ఆర్టీసీ డిపో ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా

By

Published : Aug 5, 2020, 3:32 PM IST

ఆల్ ఇండియా కో-ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్ష్ ఆర్గనైజేషన్ పిలుపు మేరకు సిద్దిపేట ఆర్టీసీ డిపో ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

డీజిల్​, పెట్రోల్​పై పెంచిన ఎక్సైజ్​ డ్యూటీని ఎత్తివేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్​ చేశారు. రవాణా రంగ కార్మికులకు సామాజిక భద్రతా పథకాన్ని తీసుకరావాలని కోరారు. యంవీ యాక్ట్ 2019ని ఉపసంహరించుకోవాలని.. కార్మిక చట్టాలను కోడ్​లుగా మార్చే చర్యలను ఆపాలని తెలిపారు.

ఇదీ చదవండి:ఇలా ఆవిరిపడితే ముఖం వెలిగిపోవాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details