సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వాస్పత్రిలో కరోనా పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. హుస్నాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హుస్నాబాద్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల నుంచి వందల సంఖ్యలో అనుమానితులు ఆసుపత్రికి వస్తున్నారు. కనీస జాగ్రత్తలు మరిచి గుంపులు గుంపులుగా లైన్లలో నిలబడుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రంలోనే కరోనా నియంత్రణకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
పట్టించుకోవడం లేదు..
మరోవైపు పరీక్షల కోసం వస్తే గంటల కొద్దీ వేచి చూడాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య సిబ్బందికి పరిచయం ఉన్నవారికి త్వరగా పరీక్షలు నిర్వహిస్తున్నారని.. మిగిలిన వారిని సరిగా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.