సిద్దిపేట జిల్లా ములుగు, మార్కుక్ మండలాల్లో నష్టపోయిన పంటలను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. ఆర్బీ కౌల్, మనోహర్‌తోపాటు వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి పంట నష్టాన్ని పరిశీలించారు. మర్కుక్‌లోని కొండపోచమ్మ జలాశయం పంపుహౌస్‌ను సందర్శించారు ఈ సందర్భంగా ప్రాజెక్టు ప్రత్యేకతలను కలెక్టర్ వెంకట్రామ రెడ్డి కూలంకుషంగా వివరించారు.
పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం - markuk mandal news
సిద్దిపేట జిల్లా ములుగు, మార్కుక్ మండలాల్లో పంట నష్టాన్ని కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. మర్కుక్‌లోని కొండపోచమ్మ జలాశయం పంపుహౌస్‌ను సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ అద్భుతమంటూ బృందం సభ్యులు కితాబునిచ్చారు.
సిద్దిపేట జిల్లాలో పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర సభ్యులు
కేవలం మూడేళ్లలోనే రూపుదిద్దుకున్న గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరమని బృందం సభ్యులకు తెలిపారు. సముద్రమట్టానికి 100 మీటర్ల ఎత్తులో ఉన్న మేడిగడ్డ నుంచి 624 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ జలాశయం వరకు నీటిని ఎత్తిపోతల ప్రాజెక్టును రూపకర్తలు డిజైన్ చేశారని కలెక్టర్ కేంద్ర బృంద సభ్యులకు వివరించారు.