సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని కాళేశ్వరం గోదావరి నీటి కాలువలోకి ప్రమాదవశాత్తు కారు దూసుకెళ్లింది. గజ్వేల్ మండలం అక్కారం పంప్‌హౌస్‌కు ఈ మధ్యే అధికారులు కాళేశ్వరం నీరు విడుదల చేసిన విషయం తెలిసిందే. కాలువల ద్వారా వస్తున్ననీటిని పరిశీలించేందుకు నిర్మాణ విభాగానికి చెందిన ఇంజినీరు కాలి నడకన వెళ్తూ కారు తీసుకు రావాలని డ్రైవరుకు చెప్పాడు.
కాళేశ్వరం కాలువలోకి దూసుకెళ్లిన కారు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని కాళేశ్వరం గోదావరి నీటి కాలువలోకి ప్రమాదవశాత్తు కారు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు కారు నడుపుతున్న డ్రైవర్ చాకచక్యంగా బయటకు రావడం వల్ల ప్రాణనష్టం జరగలేదు.
కాళేశ్వరం కాలువలోకి దూసుకెళ్లిన కారు
డ్రైవర్ కారు తీసుకొని వస్తుండగా.. ప్రమాదవశాత్తు కారు నీటి కాలువలోకి దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా కారు డోరు తీసుకొని బయటకు రావడం వల్ల ప్రాణనష్టం జరగలేదు. అనంతరం క్రేన్ సహాయంతో నీట మునిగిన కారును బయటకు తీశారు.
ఇవీ చూడండి; సమగ్ర వ్యవసాయ విధానంపై మంత్రి సమీక్ష