అందోల్ ఎమ్మెల్యే క్రాంతిపై దాడికి యత్నించిన భాజపా కార్యకర్తలు - దుబ్బాక ఉప ఎన్నిక తాజా వార్తలు
20:30 November 02
అందోల్ ఎమ్మెల్యే క్రాంతిపై దాడికి యత్నించిన భాజపా కార్యకర్తలు
సిద్దిపేటలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెరాస ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌లోకి భాజపా కార్యకర్తలు దూసుకెళ్లారు. తెరాస ఎమ్మెల్యేలు, భాజపా కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. అందోల్ ఎమ్మెల్యే క్రాంతిపై భాజపా కార్యకర్తలు దాడికి యత్నించారు. తెరాస నేతలు, భాజపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
తనపై ఉద్దేశపూర్వకంగానే భాజపా కార్యకర్తలు దాడి చేశారని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆరోపించారు. ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఓటమి భయంతోనే భాజపా కార్యకర్తలు దాడి చేశారన్నారు.