సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. 2023లో బీజేపీ నాయకత్వంలో తెలంగాణ అసెంబ్లీపై జెండా ఎగురవేస్తామన్నారు. బీజేపీలో ముఖ్యంగా పెద్ద ఎత్తున యువకులు, మహిళలు చేరుతున్నారన్నారు. బీజేపీలో చేరిన వారు దేశ కోసం పనిచేయాలని, బీజేపీ ప్రభుత్వం మన కోసం పని చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సిద్దిపేట ప్రాంతంలో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు.
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దత్తాత్రేయ - బండారు దత్తాత్రేయ
సిద్దిపేట పట్టణంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దత్తాత్రేయ