తెలంగాణ

telangana

ETV Bharat / state

TRS vs BJP in Dubbaka: తెరాస, భాజపా శ్రేణులు పోటాపోటీ నినాదాలు.. కాస్త ఉద్రిక్తత.. - రఘునందన్​ క్షమాపణలు చెప్పాలని టీఆర్​ఎస్​ డిమాండ్

BJP MLA Raghunandan comments row: మునుగోడు ప్రచారంలో భాజపా ఎమ్మెల్యే రఘునందన్​రావు తెరాస మంత్రులు కేటీఆర్​, హరీశ్​రావుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. రఘునందన్ వెంటనే​ క్షమాపణలు చెప్పాలని దుబ్బాకలో తెరాస శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. వీరికి పోటాపోటీగా భాజపా శ్రేణులు నినాదాలు చేశారు. పోలీసుల రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను అరెస్టు చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

BJP MLA Raghunandan comments on TRS Ministers should apologize
తెరాస భాజపా మధ్య పరస్పర నినాదాలు

By

Published : Oct 26, 2022, 4:57 PM IST

Updated : Oct 26, 2022, 5:06 PM IST

BJP MLA Raghunandan inappropriate comments on TRS ministers: రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, కేటీఆర్​లను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా ఎమ్మెల్యే రఘునందన్ వెంటనే​ క్షమాపణలు చెప్పాలని దుబ్బాకలో తెరాస శ్రేణులు ఆందోళనకు దిగారు. దుబ్బాక పురపాలక అధ్యక్షురాలు గన్నే వనిత ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు ధర్నా చేపట్టారు. రఘునందన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భాజపా ఎమ్మెల్యే వెంటనే మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపూరంలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. ​

దీనికి పోటీగా ఎమ్మెల్యే రఘునందన్ రావుకు తెరాస నాయకులే క్షమాపణ చెప్పాలంటూ భాజపా శ్రేణులు నినాదాలు చేశారు. మంత్రి హరీశ్​రావు, కేటీఆర్ దిష్టిబొమ్మలను కమలదళ నాయకులు దగ్ధం చేయడానికి ప్రయత్నించారు. అక్కడికి చేరుకున్న తెరాస శ్రేణులు రఘునందన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరువురు నువ్వానేనా అన్నట్లు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. దుబ్బాక బస్టాండ్ వద్ద ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి.. ఆందోళనకారులను అడ్డుకున్నారు. అయితే రోడ్డుపై బైఠాయించి తెరాస శ్రేణులు నినాదాలు చేస్తున్న వారిని ఏమీ అనని పోలీసులు, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమను అడ్డుకున్నారని భాజపా కార్యకర్తలు మండిపడ్డారు. దీంతో కాసేపు పోలీసులకు, భాజపా శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు పోలీసులు వారందరినీ అరెస్ట్​ చేసి బొంపల్లి పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 26, 2022, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details