తెలంగాణ

telangana

ETV Bharat / state

డబుల్ బెడ్​రూం ఇళ్లలో నాణ్యతే లేదు: భాజపా - రెండు పడక గదుల నిర్మాణాలపై భాజపా నాయకుల వార్తలు

హుస్నాబాద్​ శివారులో రెండు పడక గదులు నాసిరకంగా నిర్మిస్తున్నారని భాజపా నాయకులు ఆరోపించారు. కాంట్రాక్టర్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

bjp-leaders-visit-double-bed-rooms-in-husnabad
'నాసిరకమైన ఇళ్లు కడుతున్నారు... కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోండి'

By

Published : Sep 10, 2020, 3:45 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివారులోని రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణ పనులను భాజపా నాయకులు సందర్శించారు. నాసిరకం పనులతో రెండు పడక గదుల నిర్మాణం చేపట్టారని... కాంట్రాక్టర్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

హుస్నాబాద్ పట్టణంలోని శివారులో మొదటి విడతగా 160, రెండో విడతగా 300ల రెండు పడక గదుల ఇళ్లు నిర్మాణం చేపట్టారని... ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయని మండిపడ్డారు. ఇళ్లు లేని నిరుపేదల కల... కలగానే మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి నాసిరకం పనులు చేపట్టిన కాంట్రాక్టర్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి నాణ్యత ప్రమాణాలతో పూర్తిచేసి నిరుపేదలకు అందించాలన్నారు.

ఇదీ చూడండి:రవీంద్ర భారతి వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details