సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో తెలంగాణ రైతు గోస.. భాజపా పోరు దీక్ష కార్యక్రమన్ని చేపట్టారు. రైతులు పంటను అమ్ముకోవడానికి గోస పడుతున్నారని పట్టణ భాజపా అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు అన్నారు. వారాలు గడుస్తున్న ధాన్యం కొనుగోలు చేయడం లేదని తెలిపారు. కల్లాల వద్దే అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు కరోనా… మరోవైపు అకాలవర్షాలతో రైతులు నానా అవస్థలు పడుతున్నారని వాపోయారు.
'ఓవైపు కరోనా.. మరోవైపు అకాల వర్షాలు' - తెలంగాణ వార్తలు
హుస్నాబాద్ పట్టణంలో భాజపా నేతలు రైతు గోస.. భాజపా పోరు దీక్షను చేపట్టారు. పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అవస్థలు పడుతున్నారని పట్టణ భాజపా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
హుస్నాబాద్‌లో భాజపా ఆందోళన, రైతులకు మద్దతుగా భాజపా ఆందోళన
ఆలస్యం చేయకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యల్ని చెప్పుకునేందుకు ఒక వ్యవస్థ లేకుండా పోయిందన్నారు. మరో రెండు వారాల్లో వర్షాకాలం ప్రారంభం కానుండగా... ఆలోపు ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని వాపోయారు. తాలు, తరుగు పేరిట వేధించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు బంధు విడుదల చేసి, రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:సీసీఎంబీ: మరణాలకు దారితీస్తున్న వైరస్‌లేంటి?