తన చివరి శ్వాస వరకు దుబ్బాక ప్రజలకు సేవ చేస్తానని భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఉపఎన్నికల్లో సాధించిన విజయాన్ని దుబ్బాక ప్రజలకు అంకితం చేస్తున్నానని తెలిపారు. చరిత్రాత్మక విజయంతో పాలకులకు కనువిప్పు కలగాలని కోరుకున్నారు. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రఘునందన్‌రావు ధన్యవాదాలు తెలిపారు.
ఈ విజయం దుబ్బాక ప్రజలకు అంకితం: రఘునందన్ - దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ విజయం
దుబ్బాక ఫలితం.. సీఎంకు గుణపాఠం కావాలని ప్రజలు కోరుకున్నట్లు భాజపా అభ్యర్థి రఘునందన్ రావు అభివర్ణించారు. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తన విజయాన్ని దుబ్బాక ప్రజలకు అంకితం చేస్తున్నానని తెలిపారు.
bjp candidate ragunandharao thanks to dubbaka people
అక్రమ కేసులు, నిర్బంధాలను తట్టుకుని పోరాడామన్నారు. నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలనే ప్రజలు తీర్పు ఇచ్చారని ఉద్ఘాటించారు. దుబ్బాక ఫలితం.. సీఎంకు గుణపాఠం కావాలని ప్రజలు కోరుకున్నట్లు అభివర్ణించారు.