సిద్దిపేట మున్సిపాలిటీలో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. 43 వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వికలాంగులు, వృద్ధుల కోసం వీల్చైర్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 గంట వరకు 46.79 శాతం పోలింగ్ నమోదైంది.
సిద్దిపేటలో మధ్యాహ్నం 1 వరకు 46.79 శాతం పోలింగ్
సిద్దిపేట మున్సిపాలిటీలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 43 వార్డుల్లో కొవిడ్ నిబంధనల నడుమ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 వరకు 46.79 శాతం ఓటింగ్ రికార్డైంది.
సిద్దిపేటలో మధ్యాహ్నం 1 వరకు 46.79 శాతం పోలింగ్
కొవిడ్ నిబంధన ప్రకారం వచ్చే ఓటర్లు మాస్కు ధరించి రావాలని పోలింగ్ కేంద్రం దగ్గర భౌతిక దూరం పాటించే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. బరిలో ఉన్న అభ్యర్థులు 236 మంది ఉండగా, 130 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్ల సంఖ్య 1,00,678. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి :మినీ మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం
Last Updated : Apr 30, 2021, 2:23 PM IST