దుబ్బాక భాజపా అభ్యర్థి రఘునందన్ రావు వాహనాన్ని పోలీసులు తనిఖీ చేస్తూ అత్యుత్సాహాన్ని చూపించటాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. తెరాస అధికార దుర్వినియోగానికి ఇది నిదర్శనమన్నారు. ఎన్నికల్లో గెలవాలని అధికార పార్టీ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
అధికారులు తెరాస కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు: సంజయ్ - bjp candidate ragunandhan rao
అధికారులు తమ బాధ్యతలు మరచి తెరాస కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దుయ్యబట్టారు. ఎన్నికల్లో గెలవాలని అధికార పార్టీ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
'అధికాలు తెరాస కార్యకర్తల్లా పనిచేస్తున్నారు'
నిబంధనల మేరకు కూడా ప్రచారం చేసుకోకుండా అడ్డుకుంటున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారులు తమ బాధ్యతలు మరచి తెరాస కార్యకర్తల్లా వ్యవహారిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే ఈ ఎన్నికలు పారదర్శకంగా జరగడం కష్టమేనన్నారు. ఇప్పటికైనా.. రాష్ర్ట ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని దుబ్బాక ఉపఎన్నికలు పారదర్శకంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: తెలంగాణలో దసరా వరకూ పరీక్షలన్నీ వాయిదా
Last Updated : Oct 20, 2020, 8:04 PM IST