భాజపా ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి నిర్వహించే గాంధీ సంకల్ప యాత్రపై సిద్దిపేట జిల్లా దుబ్బాకలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు హాజరయ్యారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు అక్టోబర్ 22 నుంచి నవంబర్ 5 వరకు ఈ యాత్ర నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట నుంచి సంగారెడ్డి వరకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ 15 రోజుల పాటు ఈ సంకల్ప యాత్ర కొనసాగనుందని తెలిపారు. ఈనెల 22న సిద్దిపేటలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం నుంచి ఈ సంకల్ప యాత్ర ప్రారంభం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు కమలాకర్ రెడ్డి, దుబ్బాక అసెంబ్లీ కన్వీనర్ వంశీకృష్ణ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలేశ్ గౌడ్, పలువురు భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు.
గాంధీ సంకల్ప యాత్రపై అవగాహన సదస్సు
ఈనెల 22 నుంచి నిర్వహించే గాంధీ సంకల్ప యాత్రపై సిద్దిపేట జిల్లాలో అవగాహన సదస్సు నిర్వహించారు. భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు పాల్గొన్నారు.
గాంధీ సంకల్ప యాత్రపై అవగాహన సదస్సు