ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారుల పాత్ర ముఖ్యమని, సెక్టోరల్ అధికారులు సమర్థవంతంగా పనిచేసి ఎన్నికల నిర్వహణలో సత్ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని ఎన్నికల నోడల్ అధికారి జయచంద్రారెడ్డి సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం సాయంత్రం దుబ్బాక ఉప ఎన్నికల సెక్టోరల్, ఏఈఆర్వో అధికారులకు నిర్వహించిన శిక్షణా శిబిరంలో ఆయన పాల్గొన్నారు.
'ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకం' - siddipeta district latest news
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎంపీడీవో కార్యాలయంలో ఉప ఎన్నికల నిర్వహణపై ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో ఎన్నికల నోడల్ అధికారి జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని ఆయన సూచించారు.
పోలింగ్‌కు ముందురోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల తరలింపు, పోలింగ్ నిర్వహణ, పోలింగ్ అనంతరం ఎలక్ట్రానికి మిషన్లు స్ట్రాంగ్ రూంలకు చేర్చే వరకు సెక్టోరల్ అధికారులు గురుతరమైన బాధ్యత నిర్వహించాల్సి ఉంటుందన్నారు. సిబ్బందికి శిక్షణ సమయంలోనే సందేహాలను నివృత్థి చేస్తున్నామని.. దీని ద్వారా విధులు సక్రమంగా నిర్వహించడానికి ఉంటుందన్నారు. ఈ శిక్షణలో సెక్టోరల్ అధికారులు, ఏఈఆర్వోలు పాల్గొన్నారు.
ఇదీ చదవండిఃఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడవు పొడిగింపు