ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో ఆరు చోట్ల, సిద్దిపేట జిల్లాలో 3 చోట్ల, మెదక్ జిల్లాలో 2 చోట్ల టీకా వేయనున్నారు. సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీశ్ రావు వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నారు. మెదటి రోజు టీకా వేసే వారికి సమాచారం సైతం అందించారు.
వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం.. రేపే ప్రారంభం - Corona vaccination in siddipet district news
రేపు ప్రారంభం కాబోయే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో ఆరు చోట్ల, సిద్దిపేట జిల్లాలో 3 చోట్ల, మెదక్ జిల్లాలో 2 చోట్ల టీకా వేయనున్నారు.
సిద్దిపేట జిల్లాలో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తి
లబ్దిదారుని గుర్తింపు కార్డు పరిశీలించి ధ్రువీకరించుకున్న తర్వాతే అతనికి వ్యాక్సిన్ వేయనున్నారు. జిల్లా కేంద్రం నుంచి టీకాలను పోలీసు రక్షణ మధ్య కేంద్రాలకు చేర్చారు. ఇప్పటికే ఆయా జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రతి కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
ఇదీ చూడండి:'వారంలో నాలుగురోజులు వ్యాక్సినేషన్... రేపే ప్రారంభం'