రాష్ట్రంలో తొలి పశవుల హాస్టల్ సిద్దిపేటలో ఆదర్శం నిలవాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో సామూహిక గొర్రెల షెడ్లు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఆ దిశగా పశువుల కొరకు సామూహిక షెడ్లు, హాస్టల్లు ఏర్పాటు చేద్దామనే ఒక ఆలోచన ఉందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, వెటర్నరీ అధికారులు పర్యటించి పైలెట్ ప్రాజెక్టులు ఎంపిక చేసిన తర్వాత అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు.
పశువులకు వసతి గృహాలు ఏర్పాటు చేద్దాం: హరీష్రావు
ఆరోగ్య సిద్దిపేటకు అడుగులు వేద్దాం అంటూ సిద్దిపేట నియోజకవర్గంలో మార్పు దిశగా నంగ్నూర్ మండల ప్రజాప్రతినిధులకు మాజీ మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు.
పశువులకు వసతి గృహాలు ఏర్పాటు చేద్దాం: హరీష్రావు