తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు సమ్మయ్యకు రెండు ఆవులను కొనిచ్చిన ఆంధ్రా ఎన్నారై - ఆవులు మరణించాయి

ఈనెల 13న విద్యుదాఘాతంతో సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు చెందిన రైతు సమ్మయ్యవి రెండు ఆవులు మృత్యువాత పడ్డాయి. చనిపోయిన ఆవులపై పడి కన్నీటిపర్యంతమైన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది. వీడియో చూసి చలించిపోయిన ఆంధ్రకు చెందిన ఎన్నారై స్నేహితుల ద్వారా ఆవులను కొని సమ్మయ్యకు పంపించాడు.

రైతు సమ్మయ్యకు రెండు ఆవులను కొనిచ్చిన ఆంధ్రా ఎన్నారై

By

Published : Jul 26, 2019, 11:33 PM IST

ఈనెల 13న సిద్దిపేట జిల్లాలో విద్యుత్​ తీగలు తెగిపడి అక్కన్నపేటకు చెందిన సమ్మయ్య రెండు ఆవులు మృత్యువాతపడ్డాయి. చనిపోయిన ఆవుల వద్ద సమయ్య కన్నీటిపర్యంతం అయ్యాడు. ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది. ఈ వీడియోను చూసిన చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఎన్నారై ప్రభాకర్​రెడ్డిని కదిలించింది. రైతుల దుస్థితి తెలుసుకున్న ప్రభాకర్​రెడ్డి మిత్రుల ద్వారా పూర్తి వివరాలు తెలుసుకున్నాడు. రైతు సమయ్యకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుల ద్వారా హుస్నాబాద్​ మార్కెట్లో రూ.80 వేలతో రెండు ఆవులకు కొని సమయ్యకు పంపించాడు. ఆవులను ఇంటి ఆవరణలో చూసిన సమయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎన్నారై ప్రభాకర్​కు రైతు సమ్మయ్య కృతజ్ఞతలు తెలిపాడు.
తాను కూడా రైతు కుటుంబం నుంచే వచ్చానని.. ఆ కష్టనష్టాలు తెలుసని ఎన్నారై ప్రభాకర్​రెడ్డి తెలిపారు. రైతుకు సాయం చేయడం చాలా సంతృప్తి ఇచ్చిందని తెలిపారు.

రైతు సమ్మయ్యకు రెండు ఆవులను కొనిచ్చిన ఆంధ్రా ఎన్నారై

ABOUT THE AUTHOR

...view details