రన్ రాజా రన్ - gajwel
గజ్వేల్లో చేపట్టిన ఎయిర్ఫోర్స్ నియామక ర్యాలీ రెండోరోజు విశేష స్పందన లభించింది. విడతలవారీగా పరీక్షలు నిర్వహించి ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు.
ఎయిర్ఫోర్స్ నియామక ర్యాలీ
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో భారత వైమానిక దళ 12వ నియామక ర్యాలీ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 17 జిల్లాలకు చెందిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం 4 గంటల నుంచే ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టారు. అభ్యర్థులకు పరుగు పందెం నిర్వహించారు. ఇందులో నెగ్గిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన, దేహ దారుఢ్యపరీక్షలు, రాత పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఉత్తీర్ణులైనవారికి మరో రాత పరీక్ష ఉండనున్నట్టు వెల్లడించారు.
Last Updated : Feb 28, 2019, 11:03 AM IST