కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్లపైకి వస్తున్న వాహనదారులను అడ్డకుంటూ వారికి తగు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
పోలీసుల కోసం.. ఓ కుటుంబం 10 లక్షల విరాళం - సిద్దిపేటకు చెందిన దంపతులు పోలీసులకు విరాళం
లాక్‌డౌన్ నేపథ్యంలో విధి నిర్వహణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. పలువురి నుంచి అభినందనలు సైతం అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విధుల్లో ఉన్న పోలీసుల కోసం ఓ కుటుంబం 10 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చింది. వారి సంక్షేమానికి ఖర్చు చేయాలని కోరింది.
పోలీసుల కోసం.. ఓ కుటుంబం 10 లక్షల విరాళం
ఈ నేపథ్యంలో సిద్దిపేటకు చెందిన దంపతులు చక్రధర్ గౌడ్-అరోషికా రూ. 10 లక్షల చెక్కును సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌కు అందజేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల సంక్షేమానికి ఆ నిధులు వినియోగించాలని వారు కోరారు.
ఇదీ చూడండి :సరిహద్దులో ఓ వ్యక్తిని చంపేసిన మావోలు