Dog in owner funerals : రక్త సంబంధీకులు ఉండి కూడా మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి ముందుకు రాని వారిని అక్కడక్కడా చూస్తూనే ఉంటాం. కానీ అనాథ వృద్ధుడి అంతిమయాత్రకు శునకం కూడా కదలడం ఆసక్తి రేపింది. సిద్దిపేట జిల్లా కోహెడ మడలం కూరెల్ల గ్రామంలో మడుపు వెంకట్ రెడ్డి అనే వృద్ధుడికి కొద్ది రోజుల క్రితం కరోనా వచ్చింది. మాజీ సర్పంచ్ బాల్ రెడ్డి చికిత్స చేయించి ఇంటికి తీసుకువచ్చినా ఫలితం లేదు. వృద్ధుడికి కరోనా ఉందని... చూడడానికి కూడా చుట్టుపక్కల వారు ఎవరూ రాలేదు. చివరకు ఆరోగ్యం క్షీణించి మంగళవారం ప్రాణాలు విడిచాడు. అంత్యక్రియలు చేసే వారు లేరన్న విషయం తెలిసి గ్రామ సర్పంచ్ గాజుల రమేష్ అన్ని తానై అంత్యక్రియలు నిర్వహించారు. పాడే మోసి... అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.
శునకం ప్రేమ.. పాతిపెట్టేంతవరకూ గోతి చుట్టూ..! - తెలంగాణ వార్తలు
Dog in owner funerals : మనిషి చనిపోతే... అయినవాళ్లే రాని ఈ రోజుల్లో ఓ శునకం చేసిన పని ఆలోచింపజేస్తోంది. కరోనా సోకిందని... ప్రాణం పోయినా చూడడానికి ఎవరూ రాలేదు. అయితే యజమాని చనిపోతే... అంత్యక్రియల దాకా మృతదేహం చుట్టే తిరిగింది. అంతేకాకుండా ఆయనను పాతిపెట్టేందుకు తీసిన గోతి చుట్టూ తిరిగింది.
శనకం ప్రేమ.. పాతిపెట్టేంతవరకూ గోతి చుట్టూ..!
అయితే అనాథ వృద్ధుడికి ఎవరు లేకపోయినప్పటికీ అతనితో పాటు ఉన్న శునకం వృద్ధుడి గుడిసె నుంచి పాడేతో పాటు కదిలింది. ఆగుతూ సాగుతూ పాడే వైపు చూస్తూ ఉండి పోయింది. పాడేతో పాటు శునకం రావడం గ్రామస్థులను ఎంతగానో ఆలోచింపజేసింది. సాదుకున్న శునకం చివరకు వృద్ధుడి శవాన్ని పాతేందుకు తీసిన గోతి చుట్టూరా తిరిగింది.
ఇదీ చదవండి:మామతో వివాహేతర సంబంధం.. ఏకాంతంగా ఉన్నప్పుడు కుమార్తె చూసిందని..