తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.2లక్షల నగదు పట్టివేత.. ఎన్నికల అధికారికి అప్పగింత - భూంపల్లి వద్ద వాహనాల తనిఖీలు

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం... ములుగు-మెదక్ రోడ్డులో భూంపల్లి వద్ద చేపట్టిన వాహనాల తనిఖీల్లో రూ.2లక్షల నగదు పట్టుబడింది. సరైన పత్రాలు లేనందున స్వాధీనం చేసుకున్నారు.

2 lakhs cash caught at bhumpally siddipeta district
భూంపల్లి వద్ద రూ.2లక్షల నగదు పట్టివేత

By

Published : Oct 7, 2020, 12:24 PM IST

Updated : Oct 7, 2020, 1:04 PM IST

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం భూంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్​పేట చౌరస్తాలో... పోలీసులు రూ.2లక్షల నగదు పట్టుకున్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల నిర్వహణలో భాగంగా... ఈరోజు ఉదయం ప్రధాన కూడళ్ళలో వాహనాల తనిఖీ చేపట్టారు. ములుగు జిల్లా సింగరకుంటకు చెందిన రాజేందర్​ అనే వ్యక్తి రూ.2 లక్షలు కారులో తీసుకెళ్తుండా పోలీసులు పట్టుకున్నారు.

ఎలాంటి ఆధారాలు లేనందున... నగదు సీజ్ చేశారు. ఈ మొత్తాన్ని ఎన్నికల అధికారికి అప్పగించినట్టు... ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ తెలిపారు. సరైన ధ్రువపత్రాలు చూపించి డబ్బులు తీసుకోవచ్చిని సూచించారు. ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి డబ్బులు తీసుకెళ్తే సీజ్​ చేయనున్నట్టు తెలిపారు.

Last Updated : Oct 7, 2020, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details