ఆర్టీసీ కార్మికుల సమ్మె 19వ రోజుకు చేరింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని పలువురు ప్రజాప్రతినిధులకు కార్మికులు పూలు ఇస్తూ.. నిరసన తెలిపారు. మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన కార్మికులు.. జడ్పీటీసీ రవీందర్రెడ్డి, ఎంపీపీకి పూలిచ్చారు. ఆనాడు ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన ఆర్టీసీ కార్మికులు నేడు తెలంగాణలో 50 రోజులుగా జీతాలు లేక పస్తులుంటున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు మద్దతివ్వాలని వేడుకున్నారు.
ప్రజా ప్రతినిధులకు పూలిచ్చి ఆర్టీసీ కార్మికుల నిరసన - ప్రజా ప్రతినిధులకు పూలిచ్చి ఆర్టీసీ కార్మికుల నిరసన
సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు రోజుకో రకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పలువురు ప్రజా ప్రతినిధులను కలిసిన ఉద్యోగులు.. పూలిచ్చి నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేలా ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరుకున్నారు.
19TH DAY TSRTC STRIKE AT DUBBAKA