కరోనా ఆపత్కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు పెన్నిధిలా మారిందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు(MLA Manik Rao) అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ క్యాంపు కార్యాలయంలో ఆరుగురు లబ్ధిదారులకు 1.63 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
MLA Manik Rao: సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే - సంగారెడ్డి జిల్లా జహీరాబాద్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ క్యాంపు కార్యాలయంలో ఆరుగురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే మాణిక్ రావు 1.63 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చేరి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నబాధితులకు… ప్రభుత్వ ఆర్థిక సహాయం కొండంత ధైర్యాన్ని ఇస్తుందని ఎమ్మెల్యే అన్నారు. చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మాణిక్ రావ్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:Eatala rajendar: ఈటల రాజేందర్ చేరికకు భాజపా పచ్చజెండా