సంగారెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో "యువతరంగం" పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 14 కళాశాలల బాలికలు పాల్గొన్నట్లు ప్రిన్సిపల్ అనిత తెలిపారు. నాటకం, ఏకపత్రాభినయం, ముగ్గులు, చిత్రలేఖనం, మిమిక్రి అంశాలపై జిల్లా స్థాయి పోటీలు నిర్వహించినట్లు ఆమె స్పష్టం చేశారు.
యువతరంగం పోటీలు.. ఉప్పొంగిన ఉత్సాహం - sangareddy district news today
సంగారెడ్డి జిల్లాలో యువతరంగం పోటీలు వైభవంగా నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా 14 కళాశాలల నుంచి విద్యార్థులు ఆయా పోటీల్లో పాల్గొని ఉత్సహాంగా గడిపారు.
యువతరంగం పోటీలు.. ఉప్పొంగిన ఉత్సహం
ముగ్గుల పోటీల్లో భాగంగా విద్యార్థులు చెట్లను రక్షించాలని, ఆడ పిల్లలను బతికించాలంటూ వేసిన ముగ్గులు అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో విద్యార్థులు పలు సాంస్కృతిక నృత్యాలు చేశారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయికి పంపనున్నట్లు ప్రిన్సిపల్ అనిత పేర్కొన్నారు.
ఇదీ చూడండి : అవినీతి లేకుండా అభివృద్ధి చేస్తా: కరీంనగర్ మేయర్